Radhe Shyam Team: కనుమరుగైపోయిన "రాధే శ్యామ్" బృందం.. మీడియాకి దూరంగా..

Radhe Shyam Team: కానీ ప్రభాస్, పూజా హెగ్డే ఈ మధ్య మీడియాలో ఎక్కడ రావడం లేదు...

Update: 2021-12-30 12:00 GMT

Radhe Shyam Team: కనుమరుగైపోయిన "రాధే శ్యామ్" బృందం.. మీడియాకి దూరంగా..

Radhe Shyam Team: ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ట్రెండ్ అవుతున్న మొదటి మూడు వీడియోలో కనీసం ఒక్కటైనా ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్ల వీడియో ఉంటుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలు ఈ చిత్రం ప్రమోషన్లపై బాగానే కాన్సెంట్రేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమా విడుదలైన వారానికే ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "రాధేశ్యామ్" సినిమా కూడా జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఒకవైపు ఆర్ఆర్ఆర్ బృందం ఈ విషయంలో తగ్గేదే లేదు అంటూ అన్ని భాషల్లోనూ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తుంటే "రాధే శ్యామ్" బృందం మాత్రం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తోంది.

టి సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ల మీద మాత్రం దర్శకనిర్మాతలు అంతగా దృష్టి పెట్టకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ ఓపెనింగ్ డే కలెక్షన్లు భారీగా రావాలంటే దానికి ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. కానీ ప్రభాస్, పూజా హెగ్డే ఈ మధ్య మీడియాలో ఎక్కడ రావడం లేదు.

మరి ఇప్పటికైనా చిత్రబృందం ప్రమోషన్ల కోసం ముందుకు వస్తుందో లేదో వేచి చూడాలి. ఈ మధ్యనే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసినప్పటికీ కి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అందలేదు కాబట్టి చిత్ర బృందానికి సినిమాని విడుదల చేయాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది.

Tags:    

Similar News