ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి మరో మెలొడీ..గంటలోనే మిలియన్ వ్యూస్
Radhe Shyam: ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.
Radhe Shyam: ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. 'చలో చలో సంచారి' అంటూ సాగే ఈ మెలోడీని యూరప్ వీధులు, మంచు కొండల్లో షూట్ చేశారు. తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ వెర్షన్స్‌లో విడుదలైన ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాట విడుదలైన గంటలోనే యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌కు రీచ్ అవ్వడం విశేషం.
అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.