Paris Olympics 2024: తెలుగు తేజంతో చిరు ఫ్యామిలీ.. పారిస్‌లో సందడి చేసిన మెగాస్టార్..!
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై భారత్ అత్యధిక ఆశలు పెట్టుకున్న క్రీడాకారుల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరు కూడా చేరింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై భారత్ అత్యధిక ఆశలు పెట్టుకున్న క్రీడాకారుల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరు కూడా చేరింది. సింధు ఆదివారం విజయంతో పారిస్ ఒలింపిక్స్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సింధు మొదటి మ్యాచ్‌ని చూసేందుకు ఆమె స్పెషల్ అంకుల్ పారిస్ చేరుకున్నారు. ఆమె మామ ఎవరో కాదు.. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అని మీకు తెలుసా.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసిన పీవీ సింధు..
పీవీ సింధు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో సౌత్ సినీ నటుడు చిరంజీవి, అతని కుటుంబంతో ఉన్న ఫొటోను పంచుకున్నారు. చిరంజీవి తన మ్యాచ్‌ని చూసేందుకు ప్యారిస్‌కు వచ్చారని ఆమె ఈ పోస్ట్‌లో తెలిపారు. చిరంజీవితో పాటు ఆయన కుటుంబం మొత్తం కూడా పారిస్ చేరుకున్నారు.
కుటుంబ సమేతంగా ఈ మ్యాచ్‌ను వీక్షించిన చిరంజీవి..
సింధు తన పోస్ట్‌లో మూడు ఫొటోలను షేర్ చేసింది. మొదటి ఫొటోలో ఆమె చిరంజీవితో మాట్లాడుతూ కనిపించింది. రెండవ ఫొటోలో ఆమె చిరంజీవి భార్య సురేఖ చేయి పట్టుకుని కనిపించింది. చివరి ఫొటోలో చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన కూడా కనిపించారు.
చిరంజీవిని అంకుల్ అంటూ పిలిచిన సింధు..
ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌లో, 'పారిస్‌లో నా మొదటి మ్యాచ్‌ని చూడటానికి చిరు మామ (చిరంజీవి), ఆయన కుటుంబం వచ్చింది. ఒలింపిక్స్‌లో ఈ సీన్ నాకు ఎంతో నచ్చింది. చిరు అంకుల్ కి ఉన్నంత క్లాస్, గ్రేస్, చార్మ్ ఉన్నవాళ్లు ప్రపంచంలో చాలా తక్కువ. సినీ ప్రపంచంలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.