Pushpa Fourth Single: "ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా" ఫుల్ సాంగ్ విడుదల

* "పుష్ప" చిత్రం నుండి నాలుగో సింగిల్ విడుదల

Update: 2021-11-19 07:55 GMT

పుష్ప ఏయ్ బిడ్డా ఫుల్ సాంగ్ విడుదల

Pushpa Fourth Single: ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "పుష్ప". ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా "పుష్ప" చిత్రం నుండి నాలుగో సింగిల్ "ఏ బిడ్డా ఇది నా అడ్డా" ఫుల్ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకోగా తాజాగా ఈ మాస్ సాంగ్ కూడా విడుదలైన కాసేపటికే యూట్యూబ్ ట్రేండింగ్ లో నిలిచింది.

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ నాలుగో సింగిల్ తన ఫేవరేట్ సాంగ్ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Full View


Tags:    

Similar News