Pushpa 2: 'పుష్ప'గాడి రూల్‌ మొదలైంది.. అప్పుడే మొదలైన రికార్డుల వేట..!

Pushpa 2: కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం 'పుష్ప ది రూల్‌'.

Update: 2024-10-26 10:16 GMT

Pushpa 2: 'పుష్ప'గాడి రూల్‌ మొదలైంది.. అప్పుడే మొదలైన రికార్డుల వేట..!

Pushpa 2: కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం 'పుష్ప ది రూల్‌'. అల్లు అర్జున్‌, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. నిజానికి తొలుత ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

కాగా పుష్ప ది రూల్‌ సినిమా ఇంకా విడుదల కాకముందే రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. భారత్‌లో 6500, ఓవర్‌సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

భారత సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో విడుదలవుతోన్న తొలి సినిమా ఇదేనంటూ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన భారత్‌లో ఈ రేంజ్‌లో విడుదలవుతోన్న తొలి చిత్రంగా పుష్ప రికార్డు సృష్టించనుంది. దీంతో ఇప్పుడీ వార్త బన్నీ అభిమానుల్లో జోష్‌ను నింపాయి. ఈ లెక్కన చూసుకుంటే పుష్ప సీక్వెల్ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే పుష్ప 2 చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచేసింది. పుష్ప మొదటి పార్ట్‌లో ఎర్రచందనం సిండికేట్‌కు నాయకుడిగా ఎదిగిన పుష్ప.. ఆ సామ్రాజ్యాన్ని ఎలా పాలించారు.? ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.? లాంటి వివరాలను పుష్ప ది రూల్‌లో చూపించనున్నారు. 

Tags:    

Similar News