Puri Jagannadh Praises Sonusood : సోనూసూద్ ఎప్పడూ హీరోనే: పూరీ జగన్నాథ్
Puri Jagannadh Praises Sonusood : సోనూసూద్... ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది.
Puri Jagannadh Praises Sonusood : సోనూసూద్... ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది. కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ఇబ్బంది పడుతున్న వలస కూలీలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు సోనూసూద్ .. ప్రజారవాణా లేకా డబ్బులు లేకా కాలినడకన తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా వలస కూలీలను చూసి చలించిపోయి వారికి బస్సు సౌకర్యాలు కలిపించి వారిని వారి గ్రామాలకు పంపించి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
అంతేకాకుండా కరోనాతో యద్ధం చేస్తన్న పంజాబ్‌లోని డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ కిట్లు అందించాడు. ముంబైలో తనకున్న హోటల్‌లో వైద్య సిబ్బందికి ఎకామిడేషన్ ఏర్పాటు చేశాడు..దీంతో నెటిజన్లు సోనూసూద్ సేవలను కొనియాడుతూ రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతటితో ఆగకుండా కష్టం అనే మాట వింటే అక్కడే వాలిపోతున్నాడు. ఇప్పుడు అందరికి సినిమాలో కనిపించే విలన్ సోనూసూద్ కాదు.. అతనో హీరో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాన్నీ ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్యాగ్ చేశాడు. `ఏక్ నిరంజన్` సినిమాలో సోనూసూద్‌కి సంబంధించిన ఓ డైలాగ్ షేర్ చేస్తూ.. "సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది పూరీ జగన్ అన్నయ్య. సోనూసూద్ భాయ్.. మీరు రియల్ హీరో" అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనికి స్పందించిన పూరీ "సోనూ ఎప్పుడూ హీరోనే అని నాకు తెలుసు` అని ట్వీట్ చేశాడు పూరీ..
ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రంలో పసుపతిగా నటించి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత జులాయి, దూకుడు, ఆగడు,కందిరీగ మొదలైన సినిమాల్లో నటించి మంచి విలన్ గా స్థిరపడిపోయారు.