Puri Jagannadh: 21 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ @ పూరీ జగన్నాథ్

Puri Jagannadh 21 Years in TFI: ఇండస్ట్రీలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు... పోతుంటారు.

Update: 2021-04-21 10:52 GMT

పూరీ జగన్నాథ్ (ఫొటో ట్విట్టర్)

Puri Jagannadh 21 Years in TFI: ఇండస్ట్రీలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు... పోతుంటారు. కానీ, వారిలో కొంతమంది మాత్రమే తమ మార్క్ ట్రెండ్ క్రియోట్ చేసి, ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరీ జగన్నథ్ ఒకరు. పూరీ జగన్నాథ్ అంటే కేవలం డైరెక్టరే కాదు... నిర్మాత, రచయితగాను సుపరిచితుడే.

మూవీ మేకింగ్ లో సరికొత్త పాఠాలు తెలుగు తెరకు పరిచయం చేశాడు. తనదైన శైలిలో సినిమాను 4 నెలల్లో పూర్తి చేసి ఔరా అనిపించాడు. తెలుగు ఇండస్ట్రీలో ఆయన కెరీర్ 21 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. బద్రి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు పూరీ జగన్నాథ్.

కెరీర్ మొదట్లోనే బంపర్ హిట్లతో అలరించాడు. పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి సినిమా అటు పవన్‌కి, ఇటు పూరీ కి ఎంతో పేరు తెచ్చింది. ఇక ఆతరువాత రవితేజ తో తీసిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' వరుస హిట్లతో ఇండస్ట్రీలో పూరీ పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలతో రవితేజ స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. ఈ తరువాత 'శివమణి', 'దేశముదురు', 'చిరుత' లాంటి సినిమాలతోనూ అలరించాడు. మహేశ్ బాబుతో తీసిన 'పోకిరి' సినిమా 2006లో తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. కానీ, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో తీసిన చిరుత మత్రం అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత కొన్ని ప్లాపులు పలకరించాయి. అయినా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. టెంపర్ సినిమాతో తన సత్తా చూపించాడు. మహేశ్ బాబుతో 'బిజినెస్ మ్యాన్' లాంటి బంపర్ హిట్ అందించి మెప్పించాడు. లెటెస్ట్ గా రామ్ హీరోగా తీసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు పూరీ.

ముక్కుసూటిగా మాట్లాడే పూరీ జగన్నాథ్.. ఓ సందర్భంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ... ఇక్కడ ఎవరికి జాలి దయ కరుణ ఉండవు.. ఇక్కడ మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయడం ఎప్పుడో మానేశారని తేల్చి చెప్పాడు. ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు పూరీ. అయినా వారు తనను ప్లాపుల్లో మాత్రం పలకరించరని, అలాంటి వారిలో మహేశ్ బాబు ఉన్నాడంటూ కుండ బద్దలు కొట్టాడు.

  • ఇప్పటి వరకు 31 సినిమాలు తీసిన పూరీ, ప్రస్తుతం తన 32 వ సినిమాను యంగ్ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు.
  • 2003లో ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డును రవితేజ తో తీసిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాకి గాను అందుకున్నాడు.
  • అలాగే 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా 'నేనింతే' చిత్రానికి గాను మరో నంది పురస్కారం అందుకున్నాడు.
  • పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి 'పోకిరి', పూరీ టాకీస్ బ్యానర్ మీద 'హార్ట్ ఎటాక్' అనే చిత్రాలను నిర్మించాడు.
  • తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి 'బుడ్డా హోగ తేరా బాప్', కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ 'అప్పు' వంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు.


Tags:    

Similar News