పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది పూరీ జగన్నాథే.. 200 రోజులు అతిపెద్ద బ్లాక్ బస్టర్
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ బాలనటుడిగా 14 సినిమాల్లో నటించారు. 2002 లో అప్పుతో కథానాయకుడిగా మారారు.
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా 14 సినిమాల్లో నటించారు. 2002 లో అప్పుతో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. పునీత్ రాజ్ కుమార్ ను కన్నడ నాట హీరోగా పరిచయం చేసింది టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథే. 'అప్పు' సినిమాతో పునీత్ శాండిల్ వుడ్ లో హీరోగా అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పునీత్. పునీత్ రాజ్ కుమార్ స్టార్ గా ఎదగడానికి అప్పు పునాది వేసింది. వసూళ్ల వర్షం కురిపించిన అప్పు, థియేటర్స్ లో 200 రోజులు రన్ పూర్తి చేసుకొని, అనేక కొత్త రికార్డ్స్ నెలకొల్పింది.
అలా పూరి జగన్నాధ్ సినిమాతో హిట్‌తో పాటు స్టార్ ఇమేజ్ అందుకున్న పునీత్ రాజ్ కుమార్ ఆ తరువాత కూడా పలు తెలుగు సినిమాలను రీమేక్ చేసి కన్నడ ప్రేక్షకులను అలరించడంతో పాటు కన్నడంలో పవర్ స్టార్ ఇమేజ్‌ను సాధించాడు. ఇదే సినిమాను తెలుగులో రవితేజతో ఇడియట్ గా రీమేక్ చేసి ఇక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు పూరీ. అప్పు తర్వాత అదే పేరుతో అభిమానులు పునీత్ ను పిలుచుకుంటున్నారు.