త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పునర్నవి
సినీ నటి, బిగ్ బాస్ ఫేం పునర్నవి భూపాలం అభినులను సర్ ప్రైజ్ చేసింది. తన చేతి వేలికి ఉంగాన్ని చూపించి అభిమానులకు, నెటిజన్లకు షాకిచ్చారు. సినిమాల్లో పెద్దగా పేరు సంపాదించుకో లేకపోయిన బిగ్ బాస్ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.
సినీ నటి, బిగ్ బాస్ ఫేం పునర్నవి భూపాలం అభినులను సర్ ప్రైజ్ చేసింది. తన చేతి వేలికి ఉంగాన్ని చూపించి అభిమానులకు, నెటిజన్లకు షాక్ ఇచ్చింది. సినిమాల్లో పెద్దగా పేరు సంపాదించుకో లేకపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఉద్భవ్ రఘునందన్ తో పున్నర్నవి కలిసి ఉన్న ఫోటోతో పాటు పునర్నవి చేతి వేలికి ఉంగరం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు మాత్రం నిజంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందా.. లేక సినిమా ప్రమోషనా అని కామెంట్ చేస్తున్నారు.
ఇక పునర్నవి భూపాలం సినిమాల విషయానికి వచ్చేసరికి ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించి మెప్పించింది.. ఇక ఆ తర్వాత పునర్నవి శర్వానంద్ హీరోగా వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో హీరో కూతురుగా నటించింది. కేవలం నటిగానే కాకుండా హీరోయిన్ కూడా నటించింది పునర్నవి.. ఆ మధ్య పిట్టగోడ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది పునర్నవి..
ఇక అమెరికాలో సాప్ట్ వేర్‌గా పనిచేస్తున్న ఉద్భవ్ రఘునందన్ పక్కా హైదరాబాదీ అని తెలుస్తోంది. ఉద్భవ్ కూడా సోషల్ మీడియాలో చాలా మందికి పరిచయమే. చికాగో సుబ్బారావు అనే యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నాడు. ఆ ఛానల్‌లో అతడు అమెరికాలో తెలుగువారు పడుతున్న కష్టాల్నీ ఫన్నీగా చూపిస్తుంటాడు. అటు పునర్నవి ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తుంది.