నాని కోసం బడ్జెట్ విషయంలో రిస్క్ చేసిన నిర్మాత
* రెట్టింపు అయిన నాని సినిమా బడ్జెట్
Dasara Movie: నాచురల్ స్టార్ అని కరియర్లో భారీ బడ్జెట్ సినిమాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పొడుగు గడ్డం మరియు జుట్టు తో ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి రస్టిక్ లుక్కుతో ఈ సినిమా లో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చ్ 30న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. తాచాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో నాని కూడా ఒకరు. నాని సినిమాకి 30 కోట్ల బడ్జెట్ వరకు పెట్టొచ్చు. గతంలో వరుస విజయాలను సాధించిన నాని మినిమం 50 కోట్ల దాకా బిజినెస్ చేశారట. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. నాని వరుసగా హిట్ లను సాధించలేకపోతున్నాడు. ఈ మధ్యనే విడుదలైన "అంటే సుందరానికి" సినిమా కూడా కేవలం పాజిటివ్ టాక్ ను మాత్రమే సంపాదించగలిగింది. కానీ కలెక్షన్లు మాత్రం అందుకోలేకపోయింది.
కానీ "దసరా" సినిమా కోసం నిర్మాత సుధాకర్ చెరుకూరి 35 కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ సినిమా పూర్తి అయ్యేసరికి బడ్జెట్ తడిసి మోపెడయింది. ముందుగా అనుకున్న బడ్జెట్ కి రెట్టింపు బడ్జెట్ సినిమా కోసం ఖర్చయింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని నిర్మాత ఏకంగా 65 కోట్లు ఖర్చు చేశారట. కేవలం నాని రెమ్యూనరేషన్ అందులో 15 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోవడం, నటీనటులు కూడా మంచి పేరున వాళ్ళు కావటం తో బడ్జెట్ ఇలా పెరిగిపోయింది. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే బడ్జెట్ చాలా వరకు తిరిగి వచ్చేసిందని నిజానికి బడ్జెట్ కంటే ఎక్కువే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అన్ని హక్కులు కలుపుకొని సినిమా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.