Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలే నుంచి రెండో ఎలిమినేషన్.. బైబై చెప్పేసిన ప్రియాంక..?

Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రేపటితో పూర్తి కానుంది.

Update: 2023-12-16 13:10 GMT

Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలే నుంచి రెండో ఎలిమినేషన్.. బైబై చెప్పేసిన ప్రియాంక..?

Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రేపటితో పూర్తి కానుంది. దాదాపు 100 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ ఆఖరి అంకానికి చేరింది. ఈ రోజు ఉదయం నుంచి గ్రాండ్ ఫినాలు షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే, మొత్తంగా ఫైనల్‌కు ఆరుగురు చేరుకున్నారు. వీరిలో తొలి ఎలిమినేషన్‌గా అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు.

ఇక విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై చర్చలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు అబ్బాయిలే విజేతలుగా నిలుస్తున్నారు. అయితే, ఈసారి అమ్మాయి విజేతగా నిలుస్తుందని ఎంతో మంది భావించారు. కానీ ప్రస్తుతం వినిపిస్తోన్న వార్తల మేరకు మరోసారి అమ్మాయిలకు వచ్చిన ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది. గ్రాండ్ ఫైనల్ వరకు వచ్చిన లేడీగా పేరుగాంచిన ప్రియాంక.. చివరి నిమిషంలో ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకుందంట.

ప్రియాంక ఎలిమినేషన్..

బుల్లితెర హీరోయిన్‌గా పేరు సంపాదించిన ప్రియాంక జైన్.. బిగ్ బాస్ 7వ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తొలి రోజు నుంచి అబ్బాయిలకు గట్టిపోటీ ఇస్తూ ఆకట్టుకుంది. మొత్తానికి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చింది. కాగా, మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లలో తక్కువ ఓట్లు రావడంతో మొదట అర్జున్, ఆ తర్వాత ప్రియాంక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారంట.

Tags:    

Similar News