Priyanka Chopra: బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అప్ అయిన ప్రియాంక చోప్రా
Priyanka Chopra: ఆ సమయంలో తన భర్త ముందు ఏడ్చేసాను అంటున్న ప్రియాంక చోప్రా
Priyanka Chopra: తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బాడీ షేమింగ్ కి గురవడం గురించి చెప్పుకొచ్చింది. ఆ పరిస్థితిని తాను ఎలా హ్యాండిల్ చేసిందో కూడా వివరించింది ప్రియాంక. లాస్ ఏంజెల్స్ లోని సౌత్ వెస్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ కి వెళ్లిన ప్రియాంక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను బాధపెట్టిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ, "ఎప్పుడూ నాకు చాలా బాధగా అనిపించింది.
నేను మా ఫ్యామిలీ తో కూడా మాట్లాడాను. నా భర్త ముందు నా టీం ముందు ఎడ్చేశాను. బాడీ సైజ్ గురించి నన్ను అవహేళన చేయటం నేను తట్టుకోలేక పోయాను," అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొంతమంది తనను తన కలర్ వల్ల నల్ల పిల్లి అని పిలిచేవారని "మనుషులందరూ బ్రౌన్ గానే ఉండే దేశంలో పుట్టాను అయినా ఎందుకు కలర్ గురించి మాట్లాడుతారు నాకు అర్థం కాదు," అని అన్న ప్రియాంక చోప్రా ఇన్నాళ్ళ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తనని ఇంకా బాడీ షేమింగ్ చేయటం తో అసంతృప్తి వ్యక్తం చేసింది.
తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ "జీ లే జరా" మరియు "లవ్ అగైన్" సినిమాలలో నటిస్తున్న ప్రియాంక చోప్రా వరుణ్ ధావన్ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న "సిటాడెల్" వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉంది.