Waheeda Rehman: వహీదా రెహమాన్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Waheeda Rehman: పద్మశ్రీ,పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న వహీదా రెహమాన్
Waheeda Rehman: అలనాటి అందాల తార వహీదా రెహమాన్ దాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డుకు ఎంపికయ్యరు. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్టీఆర్ నటించిన జయసింహ సినిమాలో రాజకుమారి పాత్రలో నటించింది. అయితే అప్పటికే రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటకు ఆమెతో డ్యాన్స్ చేయించడంతో ఇదే తన తొలి చిత్రంగా మారింది. 1971లో 'రేష్మా ఔర్ షేరా' చిత్రంతో వహీదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచింది. 1972లో పద్మశ్రీ', 2011లో పద్మభూషణ్' పురస్కారాలు అందుకున్నారు.