MAA Elections: హీటెక్కిస్తున్న "మా" అధ్యక్ష ఎన్నికలు
MAA Elections: "మా" అధ్యక్షుడు నరేష్ ప్రెస్‌మీట్ * నేను సినిమా బిడ్డను.. మా బిడ్డను -నరేష్
MAA Elections: టాలీవుడ్‌లో "మా" ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. పోటీదారుల ఆరోపణలు, విమర్శలతో "మా" అధ్యక్ష పోరు రసవత్తరంగా మారింది. సూపర్‌స్టార్ కృష్ణ నివాసంలో ప్రస్తుత "మా" అధ్యక్షుడు నరేష్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి జీవిత రాజశేఖర్ దూరంగా ఉన్నారు. ప్యానల్ అభ్యర్థుల ఎంపికలో జీవిత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక.. తానూ సినిమా బిడ్డనేనని, మా బిడ్డనని అన్నారు "మా" అధ్యక్షుడు నరేష్. కథలు చెప్పటం అలావాటు లేదన్న ఆయన.. కాగితాలతో రావడమే తనకు అలవాటని చెప్పారు. "మా" లో తన ప్రయాణం ఆరేళ్లని, చిత్రసీమకు ఏ కష్టం వచ్చినా ముందున్నామని స్పష్టం చేశారు. "మా" వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్‌గా, సెక్రటరీగా పనిచేశా, "మా" అధ్యక్షుడిగా గెలవలేవని హేళన చేస్తే.. గెలిచి చూపించానని అన్నారు నరేష్.
నాగబాబు వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు నరేష్. తాము చేపట్టే అన్ని కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు చిరంజీవి, నాగబాబుకు వివరించామని చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించే ఎవరైనా "మా" ఎన్నికల్లో పోటీ చేయొచ్చని అన్న నరేష్.. ప్రకాశ్‌రాజ్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. "మా" అనేది రాజకీయ వ్యవస్థకాదన్న నరేష్.. గెలుపెవరిదో సభ్యులే నిర్ణయిస్తారని అన్నారు.
మా సభ్యులు ఐదువందల మందేనని ప్రకాశ్‌రాజ్ అన్నారు. "మా"లో మొత్తం 9వందల 14 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 29 మంది అసోసియేట్ మెంబర్లు, 18 మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. 7వందల 20 మంది మా సభ్యులకు లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. లైఫ్ ఇన్సూరెన్స్ 3 లక్షల వరకు వస్తుందని, దీనిద్వారా 16 మందికి లబ్ది చేకూరిందని చెప్పారు నరేష్. మా చరిత్రలో 9వందల 31 మందికి మెడికల్ ఇన్సూరెన్స్ చేశామన్నారు నరేష్.