ప్రభాస్‌ని తీసుకోవడానికి కారణమదే : ప్రశాంత్‌ నీల్‌

అయితే ఈ సినిమాకి ప్రభాస్ నే హీరోగా తీసుకోవడానికి గల కారణం కూడా వెల్లడించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్..తానూ రాసుకున్న ‘సలార్‌’ కథకు ప్రభాస్‌ సరిగ్గా సరిపోతాడని తనకి అనిపించిందని, అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నానని అన్నారు.

Update: 2020-12-04 10:53 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో "సాలార్" అనే ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మేరకు బుధవారం టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూసి ఈ టైటిల్‌కు అర్థమేమిటా అనే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ టైటిల్‌ కు ఉన్న అర్ధం గురించి వెల్లడించారు.

ఉర్దూ భాష ప్రకారం 'సలార్‌' అంటే సమర్థవంతమైన నాయకుడు అని అర్థం. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు అని వెల్లడించారు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ నే హీరోగా తీసుకోవడానికి గల కారణం కూడా వెల్లడించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. తానూ రాసుకున్న 'సలార్‌' కథకు ప్రభాస్‌ సరిగ్గా సరిపోతాడని తనకి అనిపించిందని, అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నానని అన్నారు. ఈ సినిమా ద్వారా ఓ వైలెంట్‌ పాత్రను మీ ముందుకు తీసుకురానున్నానని ప్రశాంత్ వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ చూసి ఆయన ఆర్మీలో ఉండే వ్యక్తి అని అందరూ అనుకుంటారనే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను టైటిల్‌తో విడుదల చేసినట్టుగా ప్రశాంత్ నీల్ వెల్లడించాడు.

ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేం కె. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. వచ్చే ఏడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, బాలీవుడ్ లో అదిపురుష్ అనే సినిమాలకి కమిట్ అయ్యాడు ప్రభాస్.

Tags:    

Similar News