Prabhas: భారత్ పాక్ యుద్దం ఆధారంగా సినిమా చేయనున్న ప్రభాస్

Prabhas: రెట్రో మాస్ కథగా రాబోతున్న "సలార్"

Update: 2021-08-16 06:34 GMT

ప్రభాస్ సాలార్ మూవీ (ఫైల్ ఇమేజ్)

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధే శ్యామ్". రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" చిత్రం తో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్యాన్ ఇండియన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

సినిమా ఒక రెట్రో మాస్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అంతేకాకుండా 1973 బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ కథ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా నిర్మితమవుతున్న కథ అని కొందరు విశ్లేషిస్తున్నారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా రాసుకున్న ఒక ఫిక్షనల్ కథ అని సమాచారం. హొంబలే ప్రొడక్షన్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News