Salaar Movie - Prabhas: సలార్‌ లో ప్రభాస్ ద్విపాత్రాభినయం?

Salaar Movie - Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Update: 2021-05-11 11:47 GMT

ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Salaar Movie - Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన రాబోయే సినిమా 'రాధే శ్యామ్' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. కాగా, ప్రస్తుతం 'సలార్' మూవీ రెండో షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అంశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్ ను పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన కెరీర్లో మొదటిసారి డబుల్ రోల్ పోషించబోతున్నాడు. ఈ మేరకు ఫ్యాన్స్ ట్విట్టర్లో తెగ సందడి చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ రెండు పాత్రలను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దనున్నట్లు వినిపిస్తోంది.

కాగా, ప్రభాస్ మేకప్ కోసం స్పెషల్ మేకప్ టీంను నియమించనున్నారంట. ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News