Prabhas: వామ్మో.. ప్రభాస్ ధరించిన ఈ సన్ గ్లాసెస్ ధర అంతా.?
Prabhas sunglasses cost: ఈ పిక్‌లో ప్రభాస్ ధరించిన సన్ గ్లాసస్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సన్ గ్లాసస్ లూయిస్ విట్టన్ అనే విలసవంతమైన బ్రాండ్‌కు చెందినదిగా తెలుస్తోంది.
Prabhas sunglasses cost: ప్రభాస్.. ఇప్పుడీ పేరు అంటే బ్రాండ్. యంగ్ రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సిందే. అంతలా ప్రభాస్ ఇమేజ్ పెరిగిపోయింది. బాహుబలితో మొదలైన ప్రభాస్ అరాచకం కల్కి మూవీతో పీక్స్‌కి చేరిందని చెప్పాలి. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ హీరోగా ఎదిగారు ప్రభాస్.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 23). దీంతో గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా ప్రభాస్‌కు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ చిన్ననాటి ఫొటోలతో పాటు, అరుదైన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్‌కు మాత్రమే సొంతమైన రికార్డ్స్.. ఇండియన్ సినిమా ఇండిస్ట్రీలో తను వేసిన ముద్రకు సంబంధించి పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని 'ది రాజాసాబ్' సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదుల చేసిన విషయం తెలిసిందే. ఇందులో టీ-షర్ట్‌పై చెక్డ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ట్రెండీ సన్ గ్లాసెస్ ధరించారు ప్రభాస్. మొన్నటి వరకు మాస్ లుక్‌లో కనిపించిన ప్రభాస్.. ఈసారి కూల్ లుక్‌లో కనిపించాడు.
ఇదిలా ఉంటే.. ఈ పిక్‌లో ప్రభాస్ ధరించిన సన్ గ్లాసస్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సన్ గ్లాసస్ లూయిస్ విట్టన్ అనే విలసవంతమైన బ్రాండ్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ గ్లాసెస్ ధర అక్షరాల రూ. 88,000 ఉంటుందని చర్చ నడుస్తోంది. ఇప్పుడీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా 'ది రాజాసాబ్' సినిమా విషయానికొస్తే.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, యోగిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.