Prabhas: ప్రభాస్‌ సినిమా కోసం ఆడిషన్స్‌.. మోసపోవద్దంటోన్న చిత్ర యూనిట్‌..!

Prabhas: కల్కితో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్‌ ఒకటి.

Update: 2024-07-05 11:30 GMT

Prabhas: ప్రభాస్‌ సినిమా కోసం ఆడిషన్స్‌.. మోసపోవద్దంటోన్న చిత్ర యూనిట్‌..!

Prabhas: కల్కితో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్‌ ఒకటి. మారుత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు ప్రపంచ మార్కెట్‌పై దండయాత్ర చేస్తున్న ప్రభాస్‌ మారుతితో సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై అందరి దృష్టిపడిన విషయం తెలిసిందే. హార్రర్‌ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత మేర షూటింగ్‌ కూడా జరిగింది. గతంలో ఈ సినిమా లోకేషన్స్‌లో ప్రభాస్‌ లుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. కాగా చిత్ర యూనిట్ రాజాసాబ్‌ టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన విషం తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోగా సంజయ్‌ దత్‌ కూడా నటిస్తున్నారు. డార్లింగ్ సమయంలో ప్రభాస్‌ ఎలా ఉన్నారో ఆ లుక్‌లో ఇందులో కనిపించనుండంతో రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించేందుకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటన వైరల్‌ అవుతోంది. దీంతో దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది.

తాము ఎలాంటి ఆడిషన్స్‌ నిర్వహించడం లేదని, ఏదైనా సమాచారం ఉంటే తామే అధికారికంగా పంచుకుంటామని తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా ఫేక్‌ న్యూస్‌ అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి పొరపాటున ఇలాంటివి నమ్మి మోసపోకండి అంటూ చిత్ర యూనిట్‌ చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం తిరిగి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.


Tags:    

Similar News