Prabhas: 'రాజా సాబ్‌' మోషన్‌ పోస్టర్‌ చూశారా? ఇంత వేరియేషన్‌ ఏంటి భయ్యా అసలు..

Prabhas: యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2024-10-23 10:35 GMT

Prabhas

Prabhas: యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటి వరకు చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన మారుతికి ఒక్కసారిగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్‌ రేంజ్‌కు అనుగుణంగానే 'రాజాసాబ్‌' ఉండనుందని మారుతి ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సినిమా అప్‌డేట్‌ను తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించి మొదట విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా, లవర్‌ బాయ్‌లా కనిపించిన ప్రభాస్‌.. తాజాగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో మాత్రం పూర్తిగా విభిన్నమైన లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్‌ ఇందులో సింహాసనంపై కూర్చొని, చేతిలో సిగార్‌తో కనిపిస్తున్నాడు.

ఇక వీడియో చివరిలో 'హారర్‌ ఇజ్ ది న్యూ హ్యుమర్‌' అనే ఆసక్తికరమైన లైన్‌ను జోడించారు. అంటే ఈ సినిమా హారర్ నేపథ్యంలో సాగే కామెడీ మూవీ స్పష్టంగా చెప్పేశారు. అయితే ఇందులో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నారన్నని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మోషన్‌ పోస్టర్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే 'ది రాజాసాబ్‌' మూవీలో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి మారుతి ఈ సినిమాతో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేయనున్నారో చూడాలి.


Full View


Tags:    

Similar News