Prabhas 21: ప్రభాస్ కంటే ఆమెకే రెమ్యునరేషన్ ఎక్కువట!
Prabhas 21: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది.
Prabhas 21: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్సకత్వంలో 'సాహో' అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది. ఈ సినిమా తోలి రోజు ఆట నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాదించింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భరీ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.
'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవలే చిత బృందం సినిమా కి సంబంధించి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. తరువాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకి సంబందించిన వర్క్ ను నాగ్ అశ్విన్ పూర్తి చేసి స్క్రిప్ట్ కుడా లాక్ చేసాడని సమాచారం.
ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు దర్శకుడు. అతి ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ముందుగా అలియా భట్ ను సంప్రదించగా.. ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాల తో బిజీగా ఉండటం.. వంటి కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించింది. ఆ తరువాత మరో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె ని సంప్రదించగా.. తన భర్త రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన '83'లో హీరోయిన్ గా నటిస్తున్నానని.. ఆ చిత్రం తరువాత నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అయతే, ఈ సినిమా కోసం ప్రభాస్ కంటే భారీ పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. ఆ కండీషన్‌పైనే ఈ సినిమా ఒప్పుకుందని తెలుస్తుంది. ఈ మధ్యే తన ఇన్‌స్టా పేజీలో మహానటి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది దీపిక. అంతా ఆ సినిమాను చూడాలంటూ తన అభిమానులను కూడా కోరింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అతీత శక్తులున్న వాడిగా ప్రభాస్ నటించబోతున్నాడు. దేవకన్యకు, మానవుడికి పుట్టిన బిడ్డగా ప్రభాస్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.
ప్రభాస్ సరసన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా చేయడానికి ఎట్టకేలకు ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో దీపికాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో మొదలు పెట్టి 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రన్ని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు విలన్ గా మరోసారి రానా నటించే అవకాశాలు ఉన్నయాయని తెలుస్తుంది.