Pawan Kalyan Remuneration: హరీష్ శంకర్ సినిమాకి రేటు పెంచేసిన పవన్ కళ్యాణ్

* హరీష్ శంకర్ సినిమాకి పవన్ కళ్యాణ్ ఏకంగా 60 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-09-08 07:30 GMT
Power Star Pawan Kalyan Hikes his Remuneration for Director Harish Shankar Movie

పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఫోటో)

  • whatsapp icon

Pawan Kalyan Remuneration: బ్లాక్ బస్టర్ సినిమాలు వల్ల పవన్ కళ్యాణ్ మార్కెట్ పెరుగుతూ ఉండొచ్చు కానీ ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆయనకున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. ఇక తాజాగా "వకీల్ సాబ్" సినిమాకి పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపించాయి. నిజానికి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కాల్షీట్లు చాలా తక్కువ. ఆ కాల్షీట్లకు దిల్ రాజు 50 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారంటే అది సినిమాపై ఉన్న నమ్మకం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ పై ఉన్న ధీమా కూడా అని కూడా చెప్పుకోవచ్చు. మరో వైపు పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసం కూడా పవన్ కళ్యాణ్ భారీ పారతోషికాన్ని తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఏకంగా 60 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఇంతకు ముందు సినిమాతో కంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం పది కోట్లు ఎక్కువ తీసుకోబోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకోసం కాల్షీట్లు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే హరీష్ శంకర్ సినిమా కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ కు షూటింగ్ త్వరగా పూర్తి చేయమని పవన్ కళ్యాణ్ ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. మామూలుగానే హరీష్ శంకర్ సినిమాలను చాలా తొందరగా పూర్తి చేస్తారు. ఇక ఈ సినిమాని కూడా అంతే త్వరగా పూర్తి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News