Pooja Hegde New Movie: క్రేజీ కాంబినేషన్‌లో పూజా హెగ్డే?
Pooja Hegde New Movie: మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నారు.
Pooja Hegde New Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ప్రిన్స్. ఈ సినిమాలో 'పూజా హెగ్డే' ను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పూజా మరోసారి మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లే.
మహర్షి చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. అలాగే జాతీయ చలనచిత్ర అవార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం 'రాధే శ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', అలాగే విజయ్ తో ఒక తమిళ చిత్రంతో పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉంది.
త్రివిక్రమ్, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్‌లో పూజా హెగ్డే నటిస్తుందన్న వార్తలతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ సినిమాను ప్రకటించనున్నారు.