తెలుగులో ఫస్ట్ టైం.. నలుగురు హీరోయిన్స్ పిట్టకథలు మూవీ

Update: 2021-01-20 12:46 GMT

Pitta Kathalu  

ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తున్న మొదటి ఒరిజినల్ తెలుగు చిత్రం 'పిట్ట కథలు'. ఈ పిట్టకథలు మూవీని ఏకంగా నలుగు డైరెక్టర్లు రూపొందించడం విశేషం. తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి ఈ చిత్రంలోని నాలుగు పార్టులుగా దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ మూవీని ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. అలాగే, ఈ 'పిట్ట కథలు'లోని నాలుగు కథలు నలుగురు మహిళల గురించి చూపించారు.

ఆర్ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యూనీకార్న్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రోనీ స్క్రూవాలా, ఆశి దువాసారా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. టీజర్ ఈ సినిమా క్రేజ్‌ను పెంచుతుంది.

టీజర్‌లో కొన్ని సన్నివేశాలు బోల్డ్‌గా కనిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తమిళ్ ఒరిజినల్ 'పావ కథైగళ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది కూడా నాలుగు కథల మిళితమే. దీనికి సుధ కొంగర, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలోని నాలుగు క్యారెక్టర్స్ శ్రుతిహాసన్, మంచు లక్ష్మి, అమలాపాల్, ఈషా రెబ్బా నటించారు. అలాగే అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే కీలక పాత్రలు పోషించారు.


Full View

Tags:    

Similar News