ఫైరసీ దెబ్బకు టాలీవుడ్ విల విలలాడుతుంది. అసలే కరోనా టైంలో థియేటర్లో సినిమాలు రిలీజ్ లు లేక ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఓటీటీ సంస్థలు వరప్రదాయినిగా మారాయి వరసగా సినిమాలు కొంటూ రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలకు ఫైరసీ పెద్ద దెబ్బ వేస్తోంది.
కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు రెండో షో కలర్ ప్రింట్ మొత్తం బయటకు వచ్చేసేవి. థియేటర్ల నుండి ఎక్కడో ఓ చోట ఫైరసీ జరిగేది ఇప్పుడు ధియేటర్లో సినిమాల రిలీజ్ లేక పోయిన ఫైరసీ మాత్రం ఆగటం లేదు ఇన్ని రోజులు ఫైరసీ వల్ల నిర్మాతలు నష్టపోయేవారు కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు భరించాల్సి వస్తుంది.
కరోనా దెబ్బతో ఓటీటీ బాట పట్టిన నిర్మాతలకు కొద్దిగా ఉపసమనం కలుగుతున్నా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇప్పటి వరకు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవటంతో ఓటీటీలకు బాగానే నష్టాలు వస్తున్నాయి. నిశబ్బం, ఓరేయ్ బుజ్జిగా, వి లాంటి సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో ఓటీటీ వైపు చూడటం లేదు ప్రేక్షకులు. ఓటీటీ లో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ఈ సినిమాలు కనిపిస్తుంటే ఇక ప్రీమియమ్ చెల్లించి ఎందుకు చూడాలని ఫైరసీ సినిమాలను చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ప్లాప్ లతో నష్టపోతున్న ఓటీటీలు ఇప్పుడు ఫైరసీలతో నష్టపోతున్నాయి.