బిగ్ న్యూస్.. RRR హక్కులు దక్కించుకున్న ఓటీటీ, టీవీ చానల్స్ ఇవే
RRR Digital and Satellite: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్).
RRR Digital and Satellite: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). స్వాతంత్ర్య సమరవీరులు అల్లురి సీతారామరాజు(రామ్ చరణ‌్), కొమరం భీం( ఎన్టీఆర్) పాత్రల్లో ఇద్దరు హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు ఫీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,టీజర్స్ విడుదల అయ్యాయి. దీంతో సినిమాపై అంచానాలు భారీగా పెరిగాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన చరణ్, తారక్ టీజర్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఆ సినిమా థియేటర్‌లో విడుదల తర్వాత డిజిటల్, శాటిలైట్ ప్రసార హక్కులను 'పెన్ స్టూడియోస్' దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది. సినిమా ప్రసారం కానున్న డిజిటల్(ఓటీటీ), శాటిలైట్(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్ స్టూడియోస్ వెల్లడించింది. ఇంగ్లిష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్ భాషల్లో ప్రసార హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్(Netflix) దక్కించుకుంది.
1.శాటిలైట్ భాగస్వాములు
Zee cinema (హిందీ),'Star మా' (తెలుగు)తో పాటు తమిళం, కన్నడ కూడా స్టార్ ఛానల్స్ దక్కించుకున్నాయి.
2. డిజిటల్ భాగస్వాములు
NetFlix (హిందీ), Zee5 (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ), Asianet (మలయాళం) ఈ సినిమా హక్కులు దక్కించుకుంది.
అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వాయిదా పడడం ఇది మూడో సారి. గతంతో 2021 జనవరిలో విడుదల చేస్తామని ప్రటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గత ఏడాది అన్నిసినిమాలు వాయిదా పడ్డాయి. షూటీంగులు నిలిచిపోయాయి. దాంతో ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది షూటింగ్ ప్రారంభంచిన తర్వాత ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అన్ని సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ, వేసవిలో గానీ విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.