'పెళ్లి సందడి'కి 25 ఏళ్లు.. దర్శకేంద్రుడు ఎమోషనల్ ట్వీట్
శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి ‘పెళ్లి సందడి’.
శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి 'పెళ్లి సందడి'. ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్‌నే మలుపుతిప్పింది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎంఎం కీరవాణి అందించిన బాణీలు సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రంలోని ప్రతిపాట ఒక సెన్సేషన్. 'సౌందర్య లహరీ', 'మా పెరటి జాంచెట్టు' పాటలు ఇప్పటికీ అలరిస్తునే ఉన్నాయి. హీరోయిన్లందరి గురించి తెలుకుతూ వచ్చే 'రమ్యకృష్ణ లాగ ఉంటదా' అనే సాంగ్ హైలెట్ గా నిలిచింది. హీరోయిన్లు రవళి అమాయకపు చూపులుచ, దీప్తి భట్నాగర్ గ్లామర్ ఈ సినిమాకు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి.
తాజాగా ఆ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. పెళ్లి సందడి సినిమా విడుదలై 25 ఏళ్లు అయింది. నా కెరీర్, శ్రీకాంత్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణికి, చిత్ర నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్‌లకు నమస్కరిస్తున్నాను'అంటూ రాసుకొచ్చారు దర్శకేంద్రుడు.
'ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమాని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం.' అని ట్వీట్ చేశారు.