Vakeel Saab Movie: అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు నుంచి వకీల్ సాబ్
Vakeel Saab Movie: థియేటర్లలో సినిమాను మిస్సైన వారు ‘వకీల్ సాబ్’ను ఓటీటీలో ఎంజాయ్ చేయండి
Vakeel Saab on Amazon Prime: హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్' గా వచ్చిన ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కోవిడ్ సమయంలో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. మొదటి మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత పెద్దగా రాబట్టలేకపోయింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు రావాడానికి బయపడుతున్నారు.
అలాంటిదీ సినిమా కోసం అంటే ఆలోచిస్తున్నారు. దీంతో ఆల్రెడీ థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కూడా ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్రం మే 30 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుత సమయంలో థియేటర్‌లో చూసేవారి సంఖ్య పూర్తిగా తగ్గడంతో ఒప్పందం డేట్ కన్నా ముందుగానే స్ట్రీమింగ్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాతలు ఓటీటీలతో చేసుకున్న ఒప్పందం మేరకు సినిమా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మధ్య కనీసం నెలన్నర గ్యాప్ ఉండాలి.. అనేదీ ఓ కండీషన్. కానీ 'వకీల్ సాబ్' విషయంలో ఇది కుదరలేదు. చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అంటే ఈరోజు నుంచే అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఇది కావాలని చేసింది కాదు. వకీల్ సాబ్ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందన్నారు.
కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడం, కేసులు పెరగడంతో థియేటర్లు మూతపడటం జరిగింది. రావాల్సిన స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు రాలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ ఎర్లీ రిలీజ్ ఆప్షన్ ఎంచుకున్నారు. అందులో భాగంగా 30వ తేదీ అంటే ఈరోజు రాత్రి నుండి స్ట్రీమింగ్ అవ్వడానికి ఓకే అనేశారు.ఈ ముందస్తు విడుదల ద్వారా నిర్మాతకు రూ.12 కోట్ల వరకు అదనపు లాభం చేకూరినట్టు సమాచారం.
ఇక మరోవైపు అభిమానులు, థియేటర్లలో సినిమాను మిస్సైన వారు 'వకీల్ సాబ్'ను ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు.