Unstoppable Season 2: ఒకే వేదికపై చిరు, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌..?

Unstoppable Season 2: నందమూరి హీరో బాలకృష్ణ ఆహాలో వచ్చిన సెలబ్రిటీ టాక్ షో "అన్‌స్టాప‌బుల్" వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Update: 2022-09-19 07:00 GMT

Unstoppable Season 2: ఒకే వేదికపై చిరు, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌..? 

Unstoppable Season 2: నందమూరి హీరో బాలకృష్ణ ఆహాలో వచ్చిన సెలబ్రిటీ టాక్ షో "అన్‌స్టాప‌బుల్" వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బాలకృష్ణ ఈ షో తో చాలా బాగా దగ్గర అయిపోయారు. తన కామెడీ టైమింగ్ మరియు డైలాగులతో షో ఫస్ట్ సీజన్ ని బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు బాలకృష్ణ. ఇక అప్పటినుంచి అభిమానులు అందరూ సీజన్ 2 కోసం ఆసక్తి ఎదురు చూడడం మొదలుపెట్టారు.

ఇక ఈ షో రెండో సీజన్ జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఏవో ఒక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ షో రెండవ సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది. తాజాగా అన్‌స్టాప‌బుల్ రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ కి ఏ సెలబ్రిటీలు విచ్చేయనున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ లు కలిసి ఈ షోకి విచ్చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి మరి పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ తో మాట్లాడి దీనికి ఒప్పించారని తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక "గాడ్ ఫాదర్" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి కూడా ఈ ఎపిసోడ్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరియు బాలకృష్ణ లను ఒకే స్టేజిపై చూడటం అభిమానులకు భలే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

Tags:    

Similar News