Pawan Kalyan: భారత దేశంలో హాకీ కి పునర్వైభవం వస్తుందని అంటున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: చిరకాల స్వప్నం నెరవేర్చారంటూ హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

Update: 2021-08-05 14:02 GMT

Pawan Kalyan: తాజాగా ఒలింపిక్స్ లో మన భారత దేశ హాకీ జట్టు కాంస్య పతాకాన్ని ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు."చిరకాల స్వప్నం నెరవేర్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు" అంటూ పవన్ కళ్యాణ్ సంతోషించారు. "నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారులు ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒలింపిక్స్ పతకం కోసం క్రీడాభిమానులు ఎన్నోసంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్య పతాకం గెలుచుకొని అందరి కలను నెరవేర్చింది," అంటూ కొనియాడిన పవన్ కళ్యాణ్ హాకీ బృందానికి తన తరఫున మరియు జనసేన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. బలమైన ప్రత్యర్ధి ఉన్నా ఆత్మస్థిర్యంతో పోరాడి గెలిచిన వారి స్ఫూర్తి ప్రశంసనీయమైనది ఆయన పేర్కొన్నారు.

అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. చివరగా ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు మన దేశంలో పునర్వైభవం వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, బాక్సర్ లబ్స్ నా బొగ్గహెయిన్ కూడా ఒలింపిక్స్ పతకాలు సాధించడం మన దేశ క్రీడా రంగానికి శుభపరిణామం అని ఆయన తెలియజేశారు. రెజ్లర్ రవి దహియా ఫైనల్స్ కు చేరుకొన్నందున ఆయన స్వర్ణం సాధించాలని, మహిళల హాకీ జట్టు కూడా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News