Pawan Kalyan : రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా , ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా , ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిని సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. చనిపోయిన కుటుంబాలకి గాను ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించినట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అల్లు అర్జున్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించగా, రామ్ చరణ్ తేజ్ ఒక్కో కుటుంబానికి రెండున్నర లక్షల చొప్పున సాయం చేస్తున్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో సినిమాలను చేస్తున్న చిత్ర నిర్మాణ సంస్థలు మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాయి..
అయితే దీనిపట్ల పవన్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.. ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్.. " కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు - శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు" అంటూ వెల్లడించారు.
కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు - శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు🙏.
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020