Ustaad Bhagat Singh: హరీశ్‌ శంకర్‌ బాధ భరించలేక ఆ డైలాగ్‌ చెప్పా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan: గబ్బర్‌సింగ్‌ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.

Update: 2024-03-20 05:39 GMT

Ustaad Bhagat Singh: హరీశ్‌ శంకర్‌ బాధ భరించలేక ఆ డైలాగ్‌ చెప్పా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan: గబ్బర్‌సింగ్‌ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ - హరీష్‌శంకర్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రోమో విడుదలైంది. దీనిని ఉద్దేశించి ఓ రాజకీయ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్‌ చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదన్నారు.

షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్‌ను ఆ డైలాగ్ ఎందుకు రాసావని అడిగా దానికి అతను.. అందరూ మీరు ఓడిపోయారు అంటే నేను ఒక్కటే చెప్పాను. గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్ది పదునెక్కుతుందని. మీకు తెలియదు మాలాంటి ఫ్యాన్స్ మీ నుండి ఇలాంటివి కోరుకుంటారు అందుకే రాశాను అన్నాడు. అప్పుడు నేను నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం లేదని వాదించాను. కానీ హరీష్ శంకర్ పదే పదే నన్ను అడగడంతో ఆయన బాధ భరించలేక చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News