పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్‌ లుక్‌పై స్పందించిన గోపాల కృష్ణ

Paruchuri Brothers: ఎన్నో సినిమాలకి కథ, కథనం మాటలు అందించి చాలా మంది హీరోలను స్టార్ లని చేసిన రైటర్స్ పరుచూరి బ్రదర్స్

Update: 2022-04-01 12:00 GMT

పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్‌ లుక్‌పై స్పందించిన గోపాల కృష్ణ

Paruchuri Brothers: ఎన్నో సినిమాలకి కథ, కథనం మాటలు అందించి చాలా మంది హీరోలను స్టార్ లని చేసిన రైటర్స్ పరుచూరి బ్రదర్స్.. ఇందులో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు (80) ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కనీసం బయటకు కూడా రావడం లేదు. ఆయనకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్‌ అయ్యింది. ఈ విషయంపై ఎవ్వరూ స్పందించకపోయేసరికి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. దీంతో వెంకటేశ్వర రావు ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లు ఎంతకీ ఆగకపోవడంతో ఆయన సోదరుడు పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు. తన అన్నయ్య ఆరోగ్య వివరాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేశారు.

అన్నయ్య బాగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. ఈ రెండు సంవత్సరాలలో నేనూ 10 కిలోల బరువు తగ్గాను. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్‌ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. నేను ఫోన్‌లో ఆయనతో మాట్లాడుతుంటాను. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగా ఉన్నాడు. అభిమానులు, అన్నయ్యను ప్రేమించే వారు ధైర్యంగా ఉండండి అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాల కృష్ణ.

Full View


Tags:    

Similar News