Paresh Rawal: నేను కరోనాతో చనిపోలేదు..పడుకొని ఉన్నా..!
Paresh Rawal: దీనిపై స్పందించిన పరేష్ రావల్.. ఆ సమయంలో నేను చనిపోలేదు.. పడుకొని ఉన్నానంటూ చాలా ఛమత్కారంగా ట్విట్ చేశారు
Paresh Rawal: ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రజలు అనేక సమాచారం తెలుసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ పత్రి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఫాలో కావాల్సిందే. వ్యాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అనే యాప్స్ ఫ్లాట్‌ఫామ్ ఏదో ఒక దాంట్లో లేని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఒక్కసారి సోషల్ మీడియా వల్ల ప్రజలకు నిజాల కంటే ఒక్కోసారి అబద్ధాలు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సినిమా నటీనటుల విషయంలో అయితే సోషల్ మీడియాతో రకరకాల ప్రచారాలు హోరెత్తుతాయి
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వల్ల నటుడు పరేష్ రావల్ ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసారు. గత కొన్ని రోజుల క్రితం పరేష్ రావల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈయన వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా రావల్ ఈ రోజు ఉదయం 7 గంటలకు చనిపోయినట్లు ఎవరో ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పరేష్ రావల్.. ఆ సమయంలో నేను చనిపోలేదు.. ఇంకా పడుకొని ఉన్నానంటూ చాలా ఛమత్కారంగా ట్విట్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విలక్షణ నటుడిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్‌గా (NSD) నియమించారు.
పరేష్ రావల్ బాలీవుడ్‌లో తనదైన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటు తెలుగులో పాటు మరాఠీ, ఇంగ్లీష్ చిత్రాల్లో విలక్షణ నటనతో మెప్పించారు. గుజరాతి చిత్రం 'నసీబ్ నీ బలిహరి' చిత్రంతో నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. హిందీలో పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులో పరేష్ రావల్ 'క్షణ క్షణం', 'గోవిందా గోవిందా', 'మనీ' మనీ మనీ' 'రిక్షావోడు, 'బావగారు బాగున్నారా, 'శంకర్ దాదా ఎంబీబీఎస్' 'తీన్మార్' వంటి పలు చిత్రాల్లో నటించారు. బీజేపీ తరుపున 2014లో అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది.