Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

Update: 2023-01-02 13:30 GMT

Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

Vaisshnav Tej: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న వైష్ణప్ తేజ్ తరువాత "కొండ పొలం" మరియు "రంగ రంగ వైభవంగా" సినిమాలతో అంతగా మెప్పించలేకపోయాడు.

తాజాగా ఇప్పుడు తన నాలుగవ సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75% పూర్తయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలోని పాటలు షూటింగ్ మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉందట. అది కూడా పూర్తయిపోతే సినిమా నిర్మానంతర పనులతో చిత్ర బృందం బిజీ కాబోతోంది. ఈ మధ్యనే "ధమాకా" సినిమా తో సూపర్ హిట్ అందుకున్న శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా అధికారిక విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. వేసవి సమయంలో ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా తన సినిమాని వేసవిలో విడుదల చేయడానికి సిద్ధమవుతుండడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. మరి వేసవి వార్ లో పంజ వైష్ణవ్ తేజ్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.


Tags:    

Similar News