Padutha Theeyaga: సంగీత ప్రియుల‌కు గుడ్ న్యూస్.. మ‌ళ్లీ పాడుతా తీయగా

Padutha Theeyaga: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జ్ గా తెలుగులో వ‌చ్చిన పాడుతా తీయగా రెండు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరించింది.

Update: 2021-06-05 08:48 GMT

Padutha Theeyaga (Facebook) 

Padutha Theeyaga: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జ్ గా తెలుగులో వ‌చ్చిన పాడుతా తీయగా రెండు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరించింది. ఈ ప్రొగ్రాం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ప్రొగ్రాం ద్వారా ఎంతో మంచి సింగ‌ర్స్ తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చారు. అత్యుత్తమ సంగీత కార్యక్రమాల్లో దీన్నొకటిగా చెప్పాలి. ఎంతోమంది గాయనీ గాయకులు వెలుగులోకి వచ్చారు. మంచి స్థాయిని అందుకున్నారు.

తెలుగువారి మనసులపై చెరగని ముద్ర వేసిన ఆ కార్యక్రమం బాలు మరణంతో నిలిచిపోయింది. బాలును రీప్లేస్ చేయడం ఎవరి వల్లా కాదు కాబట్టి ఈ ప్రోగ్రాంను చూడలేమనే భావించారు. ఆయన స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం కూడా ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు కూడా. కాగా.. ప్రేక్షకుల మనసు నొప్పించకుండా ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడానికి ఈటీవీ ప్రణాళికలు రచించినట్లు తాజా సమాచారం. బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో పాడుతా తీయగాను నడిపించాలని నిర్ణయించార‌ని తెలుస్తోంది. కొవిడ్ పరిస్థితుల నుంచి తేరుకున్నాక ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని అంటున్నారు.

బాలు కొడుకు అంటే ప్రేక్షకుల్లో ఒక సానుకూల భావం ఉంటుంద‌ని రామోజీ రావు భావించార‌ని తెలుస్తోంది. బాలు కొడుకు తోపాటు చంద్రబోస్, సునీతలను ఈ ప్రొగ్రాంలో ఉండ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రొగ్రాం సంబంధించిన ప్రోమో వీడుద‌ల చేసింది ఈటీవి. ఇందులో బాలు కొడుకు క‌నిపించారు. 

Tags:    

Similar News