SS Rajamouli - Prabhas: ప్రభాస్ రాజమౌళి కాంబోలో మరో సినిమా...
SS Rajamouli - Prabhas: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు.
SS Rajamouli - Prabhas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని చాలా మంది స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇంతకుముందు రాజమౌళి డైరెక్షన్ లో చేసిన హీరోలు కూడా మళ్లీ మళ్లీ జక్కన్న డైరెక్షన్లో చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్ వంటి హీరోలతో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసిన రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా ఇప్పటిదాకా మూడు సినిమాలు చేశారు.
వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా "ఛత్రపతి" బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. ఆ తర్వాత విడుదలైన బాహుబలి 2 భాగాలు టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయాయి.ఇక తాజాగా మళ్లీ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
"రాజమౌళి మళ్లీ నాతో ఎప్పుడు సినిమా తీస్తారో తెలియదు కానీ మేము ఖచ్చితంగా మరొక సినిమా చేస్తాం. మేము మంచి స్నేహితులం. నేను అడగను, అలాగే రాజమౌళి కూడా చెప్పరు. కానీ మాకు ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది. అది ఎప్పుడు వర్కవుట్ అవుతుంది అని ఇప్పుడే చెప్పలేము" అని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్. ఇక ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకి అంచనాలు ఆకాశాన్ని అంటుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.