Devara OTT Release Date: ఇట్స్ అఫిషియల్.. దేవర ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి, ఎందులో..?
Devara OTT Release Date: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Devara OTT Release Date: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. రాజమౌళి దర్శకత్వం తర్వాత హీరోకు ప్లాఫ్ వస్తుందన్న సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ ఈ సినిమాతో తప్పని నిరూపించారు.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ సినిమా నార్త్‌లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఎన్టీఆర్ అద్భుత నటన, కొరటాల శివ దర్శకత్వం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. విదేశాల్లోనూ భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 450 కోట్లను రాబట్టింది. ఇక థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న దేవర మూవీ.. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
దేవర మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మరోసారి ఇంట్లో వీక్షించాలనుకునే వారు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మరి థియేటర్లలో వండర్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇక దేవర సినిమా కథ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ కొండపై ఉండే నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఎర్ర సముద్రం నుంచి వెళ్లే నౌకలపై దాడి చేసి అందులో సరకును మార్గమధ్యంలో దొంగలిస్తుంటారు ఆ నాలుగు ఊళ్ల యువకులు. అయితే ఈ పని వల్ల తమకే ముప్పు వస్తుందని గ్రహించిన దేవర (ఎన్టీఆర్) ఇకపై ఆ పనులు చేయొద్దని నిర్ణయించుకుంటాడు.
మిగతవారిని కూడా ఆ పని చేయించనివ్వడు. అయితే భైరవ (సైఫ్‌అలీఖాన్) మాత్రం అందుకు ఒప్పుకోడు. దీంతో వారిద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైర. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్నితరాలు కొనసాగింది? అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అయితే ఈ చిత్రానికి పార్ట్2 కూడా తెరకెక్కుతోంది. సీక్వెల్‌పై అంచనాలు పెరిగేలా క్లైమాక్స్‌ను రూపొందించాడు కొరటాల.