Devara: కొనసాగుతోన్న దేవర కలెక్షన్ల సునామి.. ఆ క్లబ్ లో చేరిక

NTR's Devara movie collections: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

Update: 2024-10-13 13:20 GMT

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరో తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ను దేవర బ్రేక్ చేసింది.

యాక్షన్ డ్రామాగా దొరికెక్కిన దేవర మూవీ ప్రేక్షకులను ఫిదా చేసింది. కొరటాల డైరెక్షన్, ఎన్టీఆర్ అద్భుత నటన ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఇక ఈ సినిమాతో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపించారు. ఇదిలా ఉంటే దేవర చిత్రానికి పార్ట్ 2 వస్తున్న విషయం తెలిసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ.. అసలు కథంతా పార్ట్ 2 లోనే ఉందని, దేవర సీక్వెల్ మరింత అద్భుతంగా ఉంటుందని సినిమాపై అంచనాలు పెంచేశాడు. దీంతో సీక్వెల్ ఫై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మొదటి భాగం భారీ విజయం అందుకోవడంతో. సీక్వెల్ పై కొరటాల మరింత దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్ట్ 2లో మరి కొంతమంది బాలీవుడ్ తారలను తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరి దేవర సీక్వెల్ మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News