నా అభిమాని, ఆప్తుడు ఇక లేరు: ఎన్టీఆర్‌

Update: 2019-05-06 06:19 GMT

అభిమానులను దేవుళ్లుగా చూస్తూ, వారి కష్టసుఖాలు కూడా పంచుకుంటూ ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఈమధ్యనే తనకి బాగా ఆప్తుడైన జయదేవ్‌ చనిపోయారన్న వార్త తెలిసి మనస్తాపానికి గురయ్యారు. కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి అయిన జయదేవ్‌ సోమవారం నాడు మృతి చెందారు. అతని కుటుంబసభ్యులనే కాక ఈ మరణవార్త ఎన్టీఆర్ ని కూడా కలచివేసింది. అభిమాని మృతి పై దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఒక స్టేట్డమెంట్ విడుదల చేశారు ఎన్టీఆర్.

"నాకు అత్యంత ఆప్తుడయిన జయదేవ్‌ ఇక లేరన్న వార్త తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. 'నిన్ను చూడాలని' చిత్రంతో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. ఓ నటుడిగా నా కష్టసుఖాల్లో అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్‌ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్‌ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను' అని అన్నారు ఎన్టీఆర్. జయదేవ్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు తారక్.




 


Similar News