Devara: మొదలైన దేవర రికార్డుల వేట.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్..!
Devara, Devara Movie, Devara NTR, Koratala Shiva, Devara Pre Release Tickets, Tollywood
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం దేవర. ట్రిపులార్ వంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ, అలాగే ఆచార్య వంటి ఫ్లాఫ్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అటు నార్త్‌లోనూ మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. రికార్డ్ వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా దేవర చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓవర్‌సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుక్సింగ్స్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో విదేశాల్లో ముందస్తు టికెట్ బుకింగ్స్ ప్రారంభించగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఏకంగా వన్ మిలియన్ దాటేయడం విశేషం. దీంతో నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర నిలిచింది. కాగా ఈ సినిమాకు సంబంధించి కనీసం ట్రైలర్ కూడా రాకముందే సినిమా టికెట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడం చూస్తుంటే దేవర కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది.
విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే దేవర మూవీకి సంబంధించి బాలీవుడ్‌లో కూడా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచారు. ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్‌లు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు.