NTR: తీరని కోరికగా మిగిలిపోయిన అల్లూరి సీతారామరాజు పాత్ర‌.. కార‌ణం ఇదే

NTR: సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది.

Update: 2021-05-28 11:18 GMT

ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో )

NTR: కొన్ని సినిమాలు, పాత్ర‌లు ఎవ‌రి వ‌ద్ద‌కు చేరాలో అక్క‌డికే చేర‌తాయి. ఆ పాత్ర‌లు వేయాల‌ని ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించిన ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి దూర‌మైపోతాయి. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, లెజెండ్రీ న‌టుడు ఎన్టీఆర్ కి కూడా ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. ఎన్టీఆర్ సినిమాలు చేసే తొలినాళ్ల‌లో ఆయ‌న‌కు విప్ల‌వ వీరుడు, బ్రిటిష్‌ సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాల‌ని ఉండేది. అల్లూరి సీతారామ‌రాజు జీవిత క‌థారంగా సినిమా చేయాల‌ని ఉండేది. అయితే ఎన్టీఆర్ ఆ కోరిక తీర‌లేదు. ఒక్క‌టి రెండు సినిమాల్లో ముచ్చ‌ట‌ప‌డి ఏరికోరి అల్లూరి సీతారామరాజు త‌ళుక్కున మెరిశారు. పూర్తి స్థాయిలో సినిమా మొత్తం తీయ‌కుడ‌ద‌ని ఎన్టీఆర్ నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్ నిర్ణ‌యం స‌రైందేన‌ని అంతా భావించారు కూడా.. అస‌లు ఎన్టీఆర్ అల్లూరి సినిమా స్క్రీప్ల్ వ‌ర్క్ మొద‌లు పెట్టి అర్థాంత‌రంగా నిలిపివేయడం వెన‌క ఓ క‌థ ఉంది.

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది. అల్లూరి బ్ర‌తికి ఉంటే ఇలానే ఉంటాడా అనే రీతీలో కృష్ణ న‌టించారు. ఎన్టీఆర్‌ ఈ సినిమాని మళ్లీ తీద్దామని అనుకుని, పరుచూరి సోదరులను పిలిచి, కథ సిద్ధం చేయమన్నారు. అంతటి పెద్దాయన చెప్పిన తర్వాత వారు కాదనలేకపోయారు. ప‌రుచూరి సోద‌రులు మ‌ళ్లీ కొన్ని రోజుల‌కు ఎన్టీఆర్ ముందు అస‌లు విష‌యం చెప్పారు.

''అన్నగారూ.. కృష్ణగారు తీసిన 'అల్లూరి సీతారామరాజు'ను ఒక్కసారి చూడండి. అప్పటికీ మీరు తీయాలని అనుకుంటే తప్పకుండా కథ సిద్ధం చేస్తాం'' అని అనడంతో అప్పుడు వెంటనే కృష్ణకు ఎన్టీఆర్‌ ఫోన్‌ చేసి, 'బ్రదర్‌ మీరు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలని ఉంది. వేస్తారా' అనగానే, ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేక ప్రదర్శన వేశారు. రాముడిగా, కృష్ణుడిగా చూసిన జ‌నం అల్లూరిగా అంగీక‌రిస్తారా అనేది ఎన్టీఆర్ ని సందిగ్థంలో ప‌డేసిందంట‌. 'అల్లూరి సీతారామరాజు చూసి, కృష్ణను అభినందించి, తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఎన్టీఆర్‌. తీరని కోరికగా మిగిలిపోయిన సీతారామరాజు పాత్రను అతిథి పాత్రగా మేజ‌ర్ చంద్ర‌కాంత్, స‌ర్థార్ పాప‌రాయుడు సినిమాల్లో పోషించి సంతోషపడ్డారు.1956లో ఓ సినిమాలో అల్లూరి పాత్ర‌లో న‌టించారు ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ ముందుగా అనౌన్స్ చేయ‌గానే ఎన్టీఆర్ అల్లూరి పాత్ర చేస్తార‌ని అంతా భావించారు. తాతా కోరిక మ‌న‌వడు తీరుస్తున్నాడని భావించారు. అయితే రాజ‌మౌళి అల్లూరిగా రామ్ చ‌ర‌ణ్. కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ ఎంపిక చేశాడు. ఇక బాల‌య్య అల్లూరిగా ప‌లు సినిమాల్లో అతిథి పాత్ర‌లో క‌నిపించారు.

Tags:    

Similar News