Bigg Boss 7 Telugu: తొలిరోజే నామినేషన్స్‌తో హీట్ పెంచిన బిగ్‌బాస్.. లవ్ ట్రాక్ షురూ చేసిన ఆ ఇద్దరూ..!
Bigg Boss 7 Telugu: తొలిరోజే నామినేషన్స్‌తో హీట్ పెంచిన బిగ్‌బాస్.. లవ్ ట్రాక్ షురూ చేసిన ఆ ఇద్దరూ..!
Bigg Boss 7 Telugu: ఎంతో గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ 7 లో.. అప్పుడే నామినేషన్ల హంగామా షురూ అయింది. తొలి రోజే 14 మంది కంటెస్టెంట్స్ మధ్య లొల్లి మొదలైంది. లొల్లితోపాటు మంచి ఫన్ కూడా అందించారు కంటెస్టెంట్స్. తన కామెడీతో హౌస్‌లో నవ్వులు పూయిస్తున్నాడు హీరో శివాజి. టేస్టీ తేజ పెద్దాయన అంటూ హీరో శివాజీని పిలిచాడు. ఈ క్రమంలో శివాజీ ఫైర్ అవుతున్నట్లు కనిపించాడు. ఎవర్రా నీకు పెద్దాయన అంటూ తేజను ఎదురు ప్రశ్నించాడు. ఎద్దులా ఉన్నావ్ నేను నీకు పెద్దాయనా ఏంట్రా బాబు అంటూ సమాధానమిచ్చాడు. ఇది విన్న తేజ సరే అయితే, చిన్నాయన, బ్రో అని పిలుస్తూ ఆటపట్టిస్తున్నాడు. శివాజీ మాట్లాడుతూ.. ఎవర్రా నీకు బ్రో, చిన్నాయన అంటూ ఘాటుగా సమాధనమిచ్చాడు.
ఇక తేజకు ఏమని పిలవాలోొ అర్థం కాక తలపట్టుకున్నాడు. దానికి శివాజీ నాకు శివన్న అనే పేరు ఒకటి ఉంది. అలానే పిలవండి అనడంతో హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. బిగ్ బిస్ హౌస్‌లో ఒక లవ్ స్టోరీ మొదలవుతోంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతిక మధ్య కొత్త ట్రాక్ మొదలైంది. యావర్ మాత్రం బట్టలేకుండానే బిగ్ బాస్ హౌస్‌లో హల్ చల్ చేస్తున్నాడు. నేనేం తక్కువ కాదన్నట్లు గౌతమ్ కూడా షర్ట్ తీసేసి, రచ్చ చేశాడు. శోభ శెట్టి, రతిక మధ్య గాలివాన మొదలైంది.
ఇలా సందడిగా సాగుతోన్న హౌస్‌లో నామినేషన్ ప్రక్రియతో బిగ్ బాస్ కలకలం రేపాడు. ముందుగా శివాజీని పిలిచి, హౌస్‌లో ఉండడానికి అర్హత లేని ఇద్దరి పేర్లు చెప్పమంటూ బిగ్ బాస్ కోరాగా, దానికి దామిని, గౌతమ్ అంటూ శివాజీ తెలిపాడు. కాగా, శివాజీ చెప్పిన కారణాలతో బిగ్ బాస్ ఏకీభవించలేదు. ఆతర్వాత రతికా, పల్లవి ప్రశాంత్‌లను ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి తొలిరోజు నామినేషన్లతో కాస్త బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య హీట్ పెంచేశాడు.