Niharika Wishes to Her Fiance Chaitanya: కాబోయే భ‌ర్తకి బ‌ర్త్‌డే విషెస్ అందించిన మెగా డాటర్!

Niharika Wishes to Her Fiance Chaitanya: మెగా ప్రిన్సెస్, నాగబాబు కుమార్తె నిహారికకి పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే..

Update: 2020-07-26 14:36 GMT
Niharika wishes to her fiancy for birthday

Niharika Wishes to Her Fiance Chaitanya: మెగా ప్రిన్సెస్, నాగబాబు కుమార్తె నిహారికకి పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే.. ఇప్పటికే తనకి కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అందరికి పరిచయం చేసింది నిహారిక.. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరుగుతుంది. అయితే వీరికి వచ్చే నెల ఆగస్టులో నిశ్చితార్ధం జరుగుతుందని, వచ్చే ఏడాది వివాహం జరుగనుందని తెలుస్తోంది. కానీ దీనిపైన ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకి కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది నిహారిక.. అయితే దీనివెనుక కారణం లేకపోలేదు.. ఆదివారం (జులై 26న) చైతన్య పుట్టినరోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్ట్ చేశారు నిహారిక... ఒక చిరునవ్వు మొత్తం గదిని కాంతివంతం చేస్తుంది. కౌగిలింతలు ఇల్లులా అనిపిస్తాయి. నువ్వు నీ దగ్గర నేను ఎంతో సంతోషంగా ఉంటాను చే.. అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది నిహరిక.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక‌.. ఒక మ‌న‌సు,హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సమాచారం.. దీనితో పాటుగా తమిళ్ లో ఓ సినిమాలో నటిస్తుంది నిహారిక.. 

Tags:    

Similar News