మెట్టినింట్లో నిహారిక మొదటి పుట్టిన రోజు!

‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు చైతన్య.

Update: 2020-12-18 09:26 GMT

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక నేడు (శుక్రవారం) 28 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. పెళ్లి అయిన తర్వాత నిహారిక మొదటి పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్బంగా సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య ఆమెకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. 'నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్' అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు చైతన్య. ఇక నిహారిక పుట్టిన రోజు వేడుకలు నేడు ఫలక్‌నామ ప్యాలెస్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఆ జంట అక్కడికి చేరుకున్నారు. కాగా ఈ నెల తొమ్మిదిన వివాహ బంధంతో నిహారిక, చైతన్య ఒక్కటైనా సంగతి తెలిసిందే.

Tags:    

Similar News