Rashmika Mandanna: రష్మిక పోస్టర్ తో నిరాశ చెందిన అభిమానులు
* బన్నీ ఈ సినిమాలో ఒక మాస్ అవతారంలో కనిపించనున్నారు. * ఈ సినిమా లో రష్మిక పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు
Rashmika Mandanna: ఈమధ్య నే "అల వైకుంఠ పురం లో" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "ఆర్య", "ఆర్య 2" సినిమాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బన్నీ ఈ సినిమాలో ఒక మాస్ అవతారంలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా లో రష్మిక పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అద్దం ముందు కూర్చుని తనని తాను చూసుకుంటూ చెవికీ రింగులు పెట్టుకుంటూ చాలా బాధగా కనిపిస్తుంది రష్మిక. పోస్టర్ ని జాగ్రత్తగా చూస్తే ఆమె కిచెన్ లో కూర్చున్నట్లుగా మరియు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ లాగా ఈ సినిమాలో రష్మిక కూడా ఒక రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నారు. కానీ ఈ పోస్టర్ కి మాత్రం అనుకున్న రేంజిలో రెస్పాన్స్ రావడం లేదు. అభిమానులు ఒక రకంగా రష్మికా ని చూసి నిరాశ చెందినట్లు తెలుస్తోంది. పోస్టర్ ఏమాత్రం బాలేదని ఇక సినిమాలో ఈమె పాత్ర ఇంకెలా ఉండబోతోందో అంటూ అభిమానులు సైతం ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ఇలాంటి ఒక పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి. మరి ఈ సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాలి.