Naresh Pavitra: పవిత్ర కోరిక తీర్చేందుకు నరేష్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..
పవిత్ర విషయంలో నరేష్ చేసిన పనికి నెటిజన్లు కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు. విషయం ఏంటంటే, పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్ డీ చేయాలని కోరిక. ఆ కోరిక తీర్చేందుకు పవిత్రను వెంటబెట్టుకొని వెళ్లి మరీ నరేష్ హంపీ యూనివర్సిటీ ముందు..
Naresh Pavitra: లేటు వయసులో ఘాటు ప్రేమతో నరేష్-పవిత్ర లోకేశ్ జంట టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ జంట తాజాగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి ఇటీవలే విడుదలైంది. ఎవరు ఏం అనుకున్నా పర్లేదు అనే రీతిలో తమ మధ్య జరిగిన ఒరిజినల్ కథలే వెండితెరపై చూపించి అందర్ని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది కానీ వీళ్లుమాత్రం కలిసి జీవిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్.
నరేష్ ఈమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేశాడు. తాను, పవిత్ర శారీరకంగా ఫిట్ గా ఉన్నామని..అయితే పిల్లల్ని కంటే వారు 20 ఏళ్లకు వచ్చేసరికి తమకు 80 ఏళ్లు వస్తాయని కాబట్టి అంత అవసరం లేదనుకుంటున్నామని నరేష్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, పిల్లలైతే తమ ఇద్దరికీ కలిపి ఐదుగురు ఉన్నారని వాళ్లను చూసుకుంటూ భార్యభర్తలుగా హ్యాపీగా బతికేస్తామని నరేష్ సమాధానం చెప్పాడు.
ఇదిలాఉంటే, పవిత్ర విషయంలో నరేష్ చేసిన పనికి నెటిజన్లు కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు. విషయం ఏంటంటే, పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్ డీ చేయాలని కోరిక. ఇందుకోసం పవిత్ర హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాసింది. ఆ పరీక్షకు పవిత్రను దగ్గరుండి మరీ నరేష్ తీసుకెళ్లాడు. అంతేకాదు, పవిత్ర ఎగ్జామ్ రాస్తున్నంత సేపు యూనివర్సిటీ ప్రాంగణంలోనే నరేష్ గడిపాడు. ఈ విషయమే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తీరకుండా ఆగిపోయిన పవిత్ర కోరికను నెరవేర్చేందుకు నరేష్ తాపత్రయపడుతున్నాడని..పవిత్ర ఇష్టాయిష్టాలకు నరేష్ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడంటూ నెటిజన్స్ కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హాట్సాఫ్ టు నరేష్ అని కొందరు, వీడు మగాడ్రా బుజ్జిగా అని మరికొందరు తమకు తోచిన విధంగా నరేష్ ను ప్రశంసించేస్తున్నారు.