Nepal PM surprise tweet for the Bachchans: బచ్చన్లు ఇద్దరూ త్వరలో కోలుకోవాలి.. నేపాల్‌ ప్రధాని ట్వీట్‌

Nepal PM surprise tweet for the Bachchans: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్నా, పెద్ద , ధనిక, పేద అనే భేదం లేకుండా ఎవరిని వదలడం లేదు.. ఇక బాలీవుడ్ నటులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.

Update: 2020-07-12 16:34 GMT
nepal prime minister kp oli wishes amitabh bachchan a swift recovery

Nepal PM surprise tweet for the Bachchans: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్నా, పెద్ద , ధనిక, పేద అనే భేదం లేకుండా ఎవరిని వదలడం లేదు.. ఇక బాలీవుడ్ నటులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ , కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆధ్య (అభిషేక్, ఐశ్వర్య దంపతుల కూతురు) కూడా కరోనా సోకింది. మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి నివేదికలు మాత్రం నెగటివ్ అని వచ్చాయి. బిగ్ బీ కుటుంబంలో నలుగురికి కరోనా రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇక అమితాబ్ తో పాటుగా ఆయన కుటుంబం త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఇద్దరు బచ్చన్లు త్వరలో కోలుకోవాలని నేపాల్‌ ప్రధాని కేపీశర్మ ఒలి ఆదివారం ట్వీట్‌ చేశారు. 'ఇండియా దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు జూనియర్‌ బచ్చన్‌ ఆరోగ్యంగా ఉండాలి. కొవిడ్‌ నుంచి త్వరగా కోలువాలని కోరుకుంటున్నా.' అని అయన ట్వీట్ చేశారు. భారత్‌తో నేపాల్ సరిహద్దు ఉద్రిక్తతల నేపధ్యంలో కూడా బచ్చన్‌లు కోలుకోవాలని అయన ట్వీట్ చేయడం పెద్ద ప్రాధాన్యతను సంతరించుకుంది.

బిగ్ బీ ఆరోగ్యం నిలకడ :

కరోనా నిర్ధారణ కావడంతో బిగ్ బీ ముంబైలోని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యం అందిస్తున్న వైద్యులు ఆయనలో తేలికపాటి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా వెల్లడించారు. ఇక అంతకుముందు బిగ్ బీ తనతో గత పదిరోజులుగా దగ్గరగా గడిపిన అందరినీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.



Tags:    

Similar News