రకుల్ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు!
NCB Raids Rakul Preet Singh Home : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది..
NCB Raids Rakul Preet Singh Home : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేశారు.
అయితే రియాను విచారణ చేయగా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది. ఈ క్రమంలో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లతో సహా పలువురు ప్రముఖులను దర్యాప్తు కోసం ఎన్‌సిబి అధికారులు పిలిపించారు. . అయితే, కేంద్ర ఏజెన్సీ నుంచి సమన్లు రాలేదంటూ నటి రకుల్ ప్రీత్ మేనేజర్ గురువారం ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే తనకి సమన్లు అందాయని, శుక్రవారం విచారణకు హాజరవుతున్నానని రకుల్ వెల్లడించినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే గురువారం ముంబైలోని రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సమన్లు పంపినా సమాధానం లేకపోవడం, ఈరోజు విచారణకు హాజరుకాకపోవడం వల్లే ఎన్‌సీబీ అధికారులు రకుల్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ ముంబైలో లేనట్టుగా తెలుస్తోంది.