Nayanthara Marriage: త్వరగా పెళ్లి చేసుకోవాలని నయనతార తండ్రి ఒత్తిడి

Update: 2021-07-13 12:12 GMT
Nayanthara Father Kurian Kodiyattu Pressures to get Married Soon | Nayanthara Marriage Date (Photo: The Hans India)

Nayanthara - (Photo: The Hans India)

  • whatsapp icon

Nayanthara Marriage: తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన "లక్ష్మి" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నయనతార తన అందం అభినయంతో పలు తెలుగు చిత్రాల్లో స్టార్ హీరోలకు జోడిగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా తన నటనతో మంచి గుర్తింపు పొందింది. ఇటీవల విజయ్ హీరోగా నటించిన "బిజిలీ" చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ ప్రస్తుతం 5 కి పైగా తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. తాజాగా నయనతార తండ్రి కురియన్ కోడియట్టు నయనతార పెళ్లి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే తమిళ దర్శకుడు విజ్ఞేశ్ శివన్ తో నయనతార గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నయనతార తండ్రి కురియన్ కోడియట్టు ఆరోగ్యం సరిగ్గా లేనందున తనకి ఏమి జరగకముందే తన కూతురి పెళ్లి కళ్ళారా చూసి వెళ్ళాలని ఉందని నయనతారని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పలు సోషల్ మీడియా లైవ్ లో అభిమానులతో తమ అభిప్రాయాలను పంచుకున్న ఈ జంట మరి తన తండ్రి కోరిక మేరకు పెళ్ళికి ఒప్పుకొని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుందో లేదో చూడాలి. ప్రస్తుతం విజ్ఞేశ్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో "నేత్రికన్" అనే సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ తరహాలోనే పలు లవ్ బ్రేకప్ ల తర్వాత నయనతార కూడా తనకంటే ఏడాది చిన్నవాడైన విజ్ఞేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లాడనుంది.

Tags:    

Similar News